Jan 05,2023 13:01

ప్రజాశక్తి - బి.కొత్తకోట : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని నాలుగో సచివాలయానికి ఆ సచివాలయం కన్వీనర్ సి.ఆర్.చిన్నికృష్ణ తన సొంత నిధులతో రూ.5 వేలు విలువ చేసే ఐ స్కానర్ ను గురువారం వితరణ గావించారు.ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీలో భాగంగా వేలిముద్రలు రాని వృద్ధుల కోసం ప్రస్తుతం ఐ స్కానర్ ఒకటే ఉండడంతో సచివాలయ సిబ్బంది,వేరే సచివాలయాలపై ఆధారపడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆలస్యమవుతుందన్నారు.దీంతో పెన్షనర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తనవంతు సాయంగా ఐ స్కానర్ ను అందజేయడం జరిగిందన్నారు.సమస్యను గుర్తించి సచివాలయం కన్వీనర్ సి.ఆర్.చిన్నికృష్ణ మానవత దృక్పథంతో సొంత నిధులతో ఐస్ స్కానర్ అందజేసినందుకు సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ శ్రీనివాసులు,కె.జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.