అమరావతి :ఎపిలో కరోనా ఉధృతి కొంతమేర తగ్గినట్లు కనిపిస్తోంది. గతంలో తొమ్మిదివేలకు దగ్గరగా నమోదవుతున్న కేసులు ప్రస్తుతం ఐదువేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 5,487 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో కేసుల సంఖ్య 6,81,161కి చేరింది. అదే సమయంలో 37 మంది కరోనా బారినపడి మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,745కి పెరిగింది. ఒక్కరోజులో 7,210 మంది కరోనా నుండి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,66,323 నమూనాలను పరిశీలించినట్లు బులెటెన్‌లో పేర్కొన్నారు.










