Feb 08,2023 15:56
  • స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి.

ప్రజాశక్తి రైల్వే కోడూరు : నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి అన్నారు. రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి స్కిల్ హబ్ సెంటర్ ను  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ విఫ్ స్థానిక శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం శ్రీలత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ రెడ్డి మాట్లాడుతూ  రైల్వేకోడూరు ప్రాంత నిరుద్యోగులకు స్వయం ఉపాధి  కల్పన కొరకు ఎంతో ప్రయత్నం చేసి ఈ స్కిల్ హబ్ ను  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని, ఈ శిక్షణలో నైపుణ్యాలు పెంచుకొని యువత ఉద్యోగులుగా రాణించాలని కోరారు. మరో ముఖ్య అతిథి కొరముట్ల శ్రీనివాసులు  మాట్లాడుతూ రైల్వే కోడూరు పరిసర ప్రాంత నిరుద్యోగ యువత ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి  బెంగళూర్, హైదరాబాద్ వంటి మహా నగరాలకు వెళ్లి  శిక్షణ తీసుకొని ఉద్యోగులుగా అవకాశాలు అందుకోవడం కొద్దిమందికి మాత్రమే అవకాశం ఉంటుంది.కానీ ఈ స్కిల్ హబ్ ద్వారా మన రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఈ శిక్షణ ఇవ్వడం చాలా సంతోషం అని అన్నారు. ఇక్కడ ప్రస్తుతం జూనియర్ సాఫ్టువేర్,సెల్ఫ్ ఎం్లాయిడ్ టైలర్ శిక్షణ ఇవ్వడం ఈ శిక్షణ లో 50 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల వైస్ ప్రెసిడెంట్  రామిరెడ్డి ద్వజారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి. సుకుమార్ రెడ్డి, వైసిపి స్టీరింగ్ కమిటీ సభ్యులు హేమన వర్మ, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్ రాజు, జడ్పిటిసి రత్నమ్మ, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్  బీ. హరికృష్ణ, కళాశాల  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.రమేష్ , ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఏ.శ్రీలక్ష్మి,స్థానిక స్కిల్ హబ్ బాధ్యులు సునీల్ కుమార్,పార్థసారథి, బుడగుంటపల్లె సర్పంచి దార్ల. చంద్రశేఖర్, రైలే కోడూరు నియోజక వర్గ వైసిపి నాయకులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.