లాస్ ఏంజిల్స్ : ట్విటర్‌లో అకస్మాత్తుగా మీ ఖాతాని అనుసరించే వారి సంఖ్య తగ్గిపోతే.. ఆందోళన పడకండి. ఎందుకంటే ట్విటర్ బాస్ ఎలన్‌మస్క్ స్పామ్, స్కామ్ ఖాతాలను తొలగించేందుకు యత్నిస్తున్నారు. గురువారం మస్క్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ''ట్విటర్ ప్రస్తుతం చాలా స్పామ్/స్కామ్ ఖాతాలను ప్రక్షాళన చేస్తోంది. మీరు మీ అనుచరుల సంఖ్య తగ్గడాన్ని మీరు చూడవచ్చు'' అని ట్వీట్ చేశారు. అలాగే ట్విటర్ క్యారెక్టర్స్ లిమిట్‌ను 280 నుండి 1000కి పెంచాలని యోచిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ మార్పుల కోసం వేచి చూడాల్సి వుంది.










