May 27,2023 15:03
  • హర్షం వ్యక్తం చేసిన ప్రజలు 

ప్రజాశక్తి - బి.కొత్తకోట : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు పాగొండ ఖలీల్ అహ్మద్ చొరవతో పట్టణంలోని ఒకటవ సచివాలయం  పరిధిలో శనివారం  విద్యుత్ స్తంభాలు దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలోని కరెంట్ కాలనీ ప్రజలు మాట్లాడుతూ గతంలో విద్యుత్ స్తంభాలు వీధుల్లో లేకుండా ఉన్నందున వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు విద్యుత్ స్తంభాలు చాలా దూరం ఉండడంతో వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరడంతో.ఈ సమస్యను స్థానిక వైకాపా నాయకుల దృష్టికి తీసుకెళ్లామని, దీంతో వారు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డికి సమస్యను తెలియజేశారన్నారు. ఆయన వెంటనే స్పందించి కొత్త విద్యుత్ దీపాలను సత్వరమే వేయించి తమ సమస్యను పరిష్కరించారన్నారు. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు, పాగొండ ఖలీల్ కు సచివాలయం ఒకటి  కన్వీనర్ గుమ్మడికాయల చాంద్ బాషా తుమ్మ గింజల జనార్ధన్ కు మరియు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.