Sep 05,2023 22:10

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌, పక్కన ఇతర అధికారులు


ప్రజాశక్తి - విజయవాడ : సింగ్‌ నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర కమిషనర్‌ ప్లాంట్‌లోని ఆధునికీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎక్సెల్‌ ప్లాంట్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులు పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాంట్‌లో జరుగుతున్న వాటర్‌ ఫౌంటైన్‌ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.ఎక్సెల్‌ ప్లాంట్‌కు రోజుకు ఎంత చెత్త వస్తుందని కంప్యూటర్‌ రూమ్‌లో సిస్టమ్‌లో తనిఖీ చేసి , చెత్త వేయింగ్‌ (వే బ్రిడ్జి) పని తీరును పర్యవేక్షించిన కమిషనర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా దీనిలో నూతనంగా వేసిన రోడ్డును పరిశీలించారు. ఎక్సెల్‌ ప్లాంట్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇన్ఫర్మేషన్‌ పార్కు పనులను పరిశీలించి పార్కులో జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సత్యనారా యణ, శానిటరీ ఇన్స్‌ పెక్టర్లు , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.