న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లురూ.8.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 24 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. కాగా.. 2022-23 పూర్తి సంవత్సరం బడ్జెట్‌హొఅంచనాల్లో ఈ మొత్తం 61.79 శాతానికి సమానమని పేర్కొంది. ఈ ఏడాదికి మొత్తానికి రూ.14.20 లక్షల కోట్ల మేర వసూళ్లను రాబట్టాలని కేంద్రం బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకుంది.










