- బికేయంయు, సిపిఐ
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : భూ కబ్జాదారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తక్షణమే రెవెన్యూ అధికారులు స్వాధీన పరుచుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, బికేఎంయు రాజంపేట నియోజకవర్గ అధ్యక్ష ,కార్యదర్శుల బీదం రాజశేఖర్, గుడిసె నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ, బి కే ఎం యూ ఆధ్వర్యంలో రాజంపేట మండల రెవెన్యూ తాసిల్దార్ కు భూ సమస్యల పైన వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండు గోల మణి, సిపిఐ రాజంపేట నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణదేవరా పాల్గొని మాట్లాడుతూ రాజంపేట మండలంలో అన్యక్రాంతానికి గురైన ప్రభుత్వ బంజర భూములను తక్షణమే రెవిన్యూ అధికారులు స్వాధీనం పరుచుకొని భూమిలేని నిరుపేద దళిత, గిరిజన, మైనార్టీలకు కోనేరు రంగారావు సిఫార్సు కమిటీ ప్రకారం ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక నిరుపేద కుటుంబానికి కూడా ఒక సెంటు భూమి ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. నిరుపేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. అసైన్మెంట్ కమిటీ ద్వారా నిరుపేదలకు ప్రభుత్వ బంజర భూములు పంచకపోతే కర్ణాటకలో బిజెపి ప్రభుత్వానికి పట్టిన గతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి కోడూరు రవి, ఉపాధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, నర్సమ్మ, రాము, లక్ష్మీదేవి, గౌసియా, వెంకటసుబ్బమ్మ, వెంకటయ్య, భవాని తదితరులు పాల్గొన్నారు.










