ప్రజాశక్తి - బి.కొత్తకోట : 108 అంబులెన్సులో తంబలపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలానికి చెందిన ఓ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే మండలంలోని యాలగిరివారిపల్లికు చెందిన జి.మంజునాథ్ భార్య శిరీషకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు.దీంతో ఆమెను కాన్పు కోసం బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బడికాయలపల్లి, వద్దకు చేరుకోగానే నొప్పులు అధికం కావడంతో ఈఎంటి శైలజ, పైలట్ రాజులు జాగ్రత్తలు తీసుకోవడంతో శిరీష పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఈఎంటి శైలజ మాట్లాడుతూ తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని, శిరీష కి ఇది రెండో కాన్పని పేర్కొన్నారు.










