Jan 02,2023 21:24

దుప్పట్లు, పండ్లు పంపిణీ

దుప్పట్లు, పండ్లు పంపిణీ
ప్రజాశక్తి-నెల్లూరు:పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మరియు రత్నమ్మ చారిటబుల్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సండే మార్కెట్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎమ్‌.డి. హఫీజుద్దీన్‌ సౌజన్యంతో సోమవారం బాలాజీ నగర్‌ లోని గీతామయి వద్ధుల ఆశ్రమం నందు వద్దులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా విశ్రాంత లేబర్‌ కమీషనర్‌ రాచపాలెం రఘు మాట్లాడుతూ హఫీజ్‌ తనకు వచ్చిన ఆదాయంలో కొంత ఇలా వద్దులకు దుప్పట్లు, పండ్లు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉన్నదని తెలిపారు. పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.మురళీమోహన్‌ రాజు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించే గుణాన్ని అలవరుచుకోవాలి. ఓ మనిషి నువ్వు సంపాదించడమే కాదు అందులో కొంత నీ చుట్టు ప్రక్కల ఉన్న నలుగురి ఆకలి తీర్చడానికి కూడా నువ్వు ఖర్చుచేయగలిగినప్పుడే నీ జీవితానికి ఒక అర్ధం పరమార్ధం ఉంటుందని వివరించారు.
ఈకార్యక్రమంలో ఆశ్రయం అధినేత తమ్మినేని పాండు, గౌతమ బుద్ద వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అరవ రాయప్ప, టివి.నటులు సింగంశెట్టి మురళీమోహన్‌, సండే మార్కెట్‌ యూనియన్‌ సభ్యులు పి.శరవణన్‌, కె.కుమరవేలు, వి. రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.