Apr 17,2023 22:11

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మలి

'దళితబంధు'ను ఎపిలోనూ అమలు చేయాలి
ప్రజాశక్తి-కావలి : దళిత బంధు పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా ఆంధ్రాలో కూడా అదే పథకాన్ని అమలు చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు మల్లి పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు ఆర్‌డిఒకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం దళిత గిరిజన సంక్షేమ పథకాలను రద్దుచేసి నవరత్నాలకు మళ్లించడం వల్ల ఆర్థికంగా చితిగిపోతున్నామని పేర్కొన్నారు. దానిమూలంగా అనేక యాప్‌ల ద్వారా ప్రయివేట్‌ సంస్థల ద్వారా తండల వ్యాపారుల ద్వారా అధిక వడ్డీలకు తీసుకొని అప్పులు పాలవుతున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వం వారు ఎస్‌సి, ఎస్‌టిలకు కార్పొరేషన్‌ ద్వారా రుణం కల్పించే వారని ఇప్పుడు ఆ పథకాలను రద్దు చేశారని తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పేరిట బ్యాంకులతో సంబంధం లేకుండా తిరిగి కట్టే విధంగా లేకుండా చదువుకున్న ప్రతి నిరుద్యోగులకు చిన్న ఉపాధి పరిశ్రమలాగా ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి చెందుతుంటే, ఇక్కడ ఆర్థికంగా రోజురోజుకు కృశించి పోతున్నారని తెలియజేశారు
. దళితబంధు రూ.10లక్షలు రుణంగా ఇచ్చి ఆదుకుంటే పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చెందుతుంటే ఇంటింటికి జగనన్న హామీ పత్రం అంటిస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఆలోచించి చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి రూ.10 లక్షలు ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని సంక్షేమ హాస్టళ్లను సంక్షోభంలోకి నెట్టి, వారికి నాడు-నేడు కూడా అమలు చేయకుండా ఉన్నారని తెలిపారు. హాస్టళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్డా వాసు, రాహుల్‌, రాంబాబు, జరుగు మల్ల్లి, విజయరత్నం, శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.