Nov 10,2023 20:32

సమావేశంలో పాల్గొన్న ఆప్కాబ్‌,డిసిసిబి అధికారులు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఇ-ఆఫీసును శుక్రవారం ప్రారంభించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం సమావేశ భవనంలో ఇ-ఆఫీసుపై కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసికి చెందిన రిసోర్స్‌ పర్సన్స్‌ బాలకృష్ణ, శంకర్‌ బ్యాంకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిసిసిబి సిఇఒ కెంబూరు జనార్ధన మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలను సకాలంలో పారదర్శకంగా అందించేందుకు ఇ-ఆఫీసు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా విజయనగరం డిసిసిబిలోనే ఇ- ఆఫీసు ప్రారంభమైందని అన్నారు. ఇకనుంచి జిల్లాలోని అన్ని డిసిసిబి బ్రాంచ్‌ల్లో ఇ-ఫైలింగ్‌ అమలు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఆప్కాబ్‌ జనరల్‌ మేనేజర్‌ , డిసిసిబి ఒఎస్‌డి జిఎస్‌ఎన్‌ రాజు, జనరల్‌ మేనేజర్లు కెవివిఆర్‌ఎన్‌ సత్యనారాయణ, సిహెచ్‌ ఉమామహేశ్వరరావు, డిసిఎంలు బిఎస్‌ఎస్‌ ప్రసాద్‌, రామకృష్ణ, లక్ష్మణరావు, పివిఎస్‌ రామారావు, ఎంజిఎంలు రామ్మోహన్‌, శ్రీనివాసులనాయుడు, మేనేజర్లు , సిబ్బంది పాల్గొన్నారు.