Nov 09,2023 21:04

రైతులతో మాట్లాడుతున్న ట్రైనీ కలెక్టర్‌ త్రివినాగ్‌

ప్రజాశక్తి- గజపతినగరం :  దేవస్థానం భూములు వేలంపాట ఆపాలని సాగుదారులు జాయింట్‌ ట్రైనీ కలెక్టర్‌ త్రివినాగ్‌ వద్ద మొరపెట్టుకున్నారు. గురువారం పాత శ్రీరంగరాజపురం, కొత్త శ్రీరంగరాజపురం గ్రామాల్లో గల దేవస్థాన భూములను ఆయన పరిశీలించారు. ఆ భూములను ఏళ్ల తరబడి సాగు చేస్తున్న రైతులను కాదని, వేలం పాట ద్వారా ధనికులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని కౌలు రైతు సంఘంజిల్లా కార్యదర్శి రాకోటి రాములు అన్నారు. ఆ భూములకు సాగులో ఉన్న రైతులకే కేటాయించాలని కోరారు. దీంతో ట్రైనీ కలెక్టర్‌ సచివాలయంలో రైతుల అభిప్రాయాలను సేకరించారు. తక్షణమే బొంగులు రీ సర్వే చేసి ఎంత భూమిని గుర్తించారో తెలపాలని తహశీల్దార్‌ అరుణకుమారిని ఆదేశించారు. ఇరు గ్రామాల సర్పంచులు కామినాయుడు, పైడపు నాయుడు భూముల వేలం నిర్వహించాలని కోరగా ఇరువాదనలు విన్న ట్రైనీ కలెక్టర్‌ నిబంధన ప్రకారం సరియైన నిర్ణయాన్ని తరువాత తెలియజేస్తామని తెలిపారు.