Mar 25,2022 18:34

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28,29 తేదీల్లో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.మజుందర్‌ కోరారు. మార్టూరు పెద్ద కూరగాయల మార్కెట్‌ ఆవరణలో నున్న సివిల్‌ సప్లయి గోడౌన్‌ వద్ద సిఐటియు ప్రాంతీయ మండలాల కార్యదర్శి బత్తుల హనుమంతరావు అధ్యక్షతన ముఠా కార్మికులు, హమాలీల జనరల్‌బాడీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, మజుందర్‌ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు కారు చౌకగా అమ్మేస్తు న్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయి హమాలీల సంఘం నాయకులు బడే నారాయణరెడ్డి, ముఠాకార్మికుల సంఘం నాయకులు మురుగుల చిన్నా, లక్ష్మయ్య, డేవిడ్‌, బొడెంపూడి సూరిబాబు, ఎనికపాటి రాంబాబు, కార్మికులు పాల్గొన్నారు.