ప్రజాశక్తి- చీరాల : ఈ నెల 28,29 తేదీల్లో నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, ఎఐటియుసి, కార్మిక సంఘాల నాయకులు కోరారు. స్థానిక ఎన్‌జిఒ కార్యా లయలో సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వసంతరావు, నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటు పరం చేస్తుందని విమర్శించారు. కరోనా సమయంలో కార్మికుల కష్టాలను గాలికొదిలేసిందన్నారు. కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వకపోక వారి హక్కులను కాలరాస్తోందని విమర్శిం చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల శామ్యూల్, అచ్యుతుని బాబూరావు, సిఐటియు నాయకులు ఎన్.బాబూరావు, ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి ఏసురత్నం,జీవిత బీమా సంస్థ కార్యదర్శి రాజు శివరామకష్ణారెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










