కడపప్రతినిధి
గడప గడపకూ ప్రభుత్వం సమీక్షలో ముగ్గురు ఎమ్మెల్యేలకు డేంజర్‌జోన్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నాలుగు నెలల కిందట నిర్వహించిన సమీక్షలో డేంజర్‌జోన్, సేఫ్‌జోన్ పేర్లతో కూడిన జాబితాలను ప్రకటించారు. డేంజర్‌జోన్ జాబితాలో కొంత మంది ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్ర మంలో ఆ ఎమ్మెల్యేలు చురుకుగా పాల్గొనలేదని, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలు వెల్లడిస్తున్నట్లు హెచ్చరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయే నేతలకు టికెట్లు ఇవ్వడం కదరదని తేల్చేసిన నేపధ్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. సచి వాలయం పరిధిలో వారంలో కనీసం నాలుగు రోజుల చొప్పున నెలకు 16 రోజులపాటు ఇంటి ంటికి వెళ్లి ప్రజలతో సంబంధాలు నెరపాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకోవాలని, వ్యక్తిగత సమస్యలు ఉంటే పరిష్కరించి ప్రజల మనసుల్ని గెలుచుకు రావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలను అమలు చేయని ఎమ్మెల్యేలను తాజా సమీక్షలో సుతిమెత్తంగానే హెచ్చరించినట్లు తెలిసింది. గతంలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో 40 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరులో మెరుగుదల కనిపించిందని, కానీ ఇప్పటికీ చాలా మంది డేంజర్‌జోన్ జాబితాలోనే ఉన్నారని, వచ్చే నవంబర్‌లో నిర్వహించే సమీక్ష నాటికి పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. లేనిపక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికల టికెట్ల కేటా యింపుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుం దని హెచ్చరించినట్లు సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మీతో కలిసి నడిచానని, అటువంటి మిమ్మల్ని పోగొట్టుకోవాల్సిన దుస్థితిని తీసుకురావొద్దని, తన ఉద్దేశాన్ని అర్థం చేసు కోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. 30 రోజుల వ్యవధిలో 12 నుంచి 16 రోజుల పాటు గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో సీరి యస్‌గా పాల్గొని, తమ పనితీరును, సమర్థతను పెంచుకోవాలని సూచించినట్లు తెలిసింది. లేని పక్షంలో 2024 సార్వత్రిక ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో సర్వే ప్రకారం సమర్థత ఆధారంగా టికెట్లను కేటాయించాల్సి వస్తుందని హెచ్చ రించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో డేంజర్‌జోన్ జాబితాలోని పేర్లను చదివి వినిపించినట్లు సమాచారం.
మరోసారి ముగ్గురే..!
కడప, అన్నమయ్య జిల్లాలోని ముగ్గ రు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కడప జిల్లాలో మైదుకూరు, అన్నమయ్య జిల్లాలో రాజం పేట, తంబళ్లపల్లి ఎమ్మెల్యేల డేంజర్‌జోన్ జాబి తాలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్ర పాద్‌రెడ్డి గడప గడపకూ ప్రభుత్వ కార్యక్రమ నిర్వ హణలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు కైవసం చేసు కోవడంతో ప్రశంసించినట్లు సమాచారం. గత సమీక్ష సందర్భంగా నియోజకవర్గాల పరిధిలోని ఆయా సచివాలయాల పరిసర ప్రాంతాల్లో అభి వృద్ధి పనుల నిమిత్తం రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేల్లో సార్వత్రిక ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో డేంజర్, సేఫ్‌జోన్ అనే తేడాలతో నిమిత్తం లేకుండా టెన్షన్ వాతావరణం నెలకొంది. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మోకాలికి శస్త్రచికిత్స చేసు కోవ డంతో ఆయన గడప గడపకూలో పాల్గొన లేక పోయారని తెలిసింది. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం ఆయన కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొ ంటున్నారనే భావన సిఎంకు వచ్చినట్లు సమాచారం.










