Oct 13,2023 15:20

ప్రజాశక్తి-పెనుకొండ : భూ పంపిణీని నవరత్నాలలో చేర్చి, దశరత్నాలు అమలుకై కృషి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 'పేదలకు భూమి-ఇళ్లు కోసం' డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నాయకులు, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా పెనుకొండ పట్టణ పురవిధుల్లో భారీ ప్రదర్శనలో ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.