ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీ కార్మికుల ఆందోళనకు మద్దతుగా, ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ నిరసన తెలిపిన సిపిఎం రాష్ట్ర నాయకులను బందర్ రోడ్డుపై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ తదితరులు ఉన్నారు. అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బందర్‌రోడ్డులోని బాపూ మ్యూజియం వద్ద ఈరోజు రాస్తారోకో చేపట్టారు.