న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధురాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వ్యవస్థాపక ఉపాధ్యక్షులు కెప్టెన్ లక్ష్మీ సెహగల్‌కు సిపిఎం ఘన నివాళులర్పించింది. ఆమెను స్మరించుకుంటూ పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. మహిళల పట్ల వివక్షకు తావులేని, సమానత్వం, న్యాయం పరిఢవిల్లే సమ సమాజ నిర్మాణం కోసం పోరాటానిు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రతినబూనుదామని సిపిఎం పిలుపునిచ్చింది. అమరవీరులు, స్వాతంత్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు ప్రతీక్షణం వెచ్చిద్దామని పేర్కొంది. ప్రజల హృదయాల్లో సజీవంగా ఉండే లక్ష్మీ సెహగల్ వంటి యోధులకు మనమిచ్చే ఘన నివాళి ఇదేనని సిపిఎం తెలిపింది.










