ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : భూమి లేని నిరుపేదలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఏర్పాటుచేసిన అసైన్మెంట్ భూ పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలని రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూల భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలను అసైన్మెంట్ కమిటీ ఇదే భాగస్వామ్యులను చేసి నిరుపేదలకు భూములు పంపిణీ చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వైసీపీ కార్యకర్తల చిట్టానే అసైన్మెంట్ కమిటీ ఎంపిక చేసినట్లు ఉందని ఆరోపించారు. మునిసిపాలిటీ పరిధిలో ఐదు కిలోనేతరుల దూరంలో నిబంధనను కూడా తుంగలో తొక్కారని అన్నారు. అర్హులైన పేదవారికి భూ పంపిణీ చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శెట్టిపల్లి సన్నీ, ముస్లిం మైనారిటీ నాయకులు చాంద్ బాషా, శివ తదితరులు పాల్గొన్నారు.










