- PVPSS సంఘము
ప్రజాశక్తి - పుల్లంపేట : అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఎ.పుత్తనవారిపల్లెకు చెందిన తోట నాగశివయ్య కుమారుడు జ్ఞాన్ అశ్విత్ పుట్టినరోజు సందర్భముగా వృద్ధులైన పేదవారికి నిత్యవసర సరుకులు వత్తలూరు మరియు SBVD సభా ప్రాంగణంలో ఉపాధ్యాయుడు గేని పెంచలయ్య చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి మాట్లాడుతూ పూట గడవలేని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు దాతైన ఎ.పుత్తనవారి పల్లెకు చెందిన తోట నాగశివయ్య కుమారుడు జ్ఞాన్ అశ్విత్ పుట్టినరోజు సందర్భముగా నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమము నిర్వహించడం జరిగినది. చిన్నారి అశ్విత్ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరాలని, చిన్న పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన వారు భవిష్యత్తులో సేవాభావాన్ని అలవర్చుకుంటారని సంఘ అధ్యక్షుడు మల్లు సుబ్బనరసారెడ్డి తెలియజేశారు. దాతల సహాయసహకారములు మరువలేనివి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మాసంఘము వారు ఎల్లప్పుడు ముందుంటామని తెలియచేయడం జరిగింది.దాతకు సంఘము తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఉపాధ్యాయుడు గేని పెంచలయ్య మాట్లాడుతూ పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము ద్వారా చిన్నారి జ్ఞాన్ అశ్విత్ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి శుభపరిణామమని చాలా మంది అనవసర ఖర్చులతో డబ్బులు వృథా చేస్తున్నారని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పది మందికి సహాయం చేయడం అని చిన్నారి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని PVPSS సంఘము వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమము నందు రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, PVPSS సంఘం ఉపాధ్యక్షుడు వాహీద్, కోశాధికారి నరసింహులు, పోస్ట్ మ్యాన్ వెంకటేష్,సంఘ సభ్యుడు రెడ్డయ్య రెడ్డి, జ్యోతీశ్వర్ నాయుడు, సంఘ వాలంటీర్లు మురళి పాల్గొనడం జరిగింది.










