ప్రజాశక్తి-కలకడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ ,కలికిరి మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ రవి కుమార్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కమలాకర్ రెడ్డి సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.అదేవిధంగా మండలంలోని రాతిగుంటపల్లి నందు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.స్థానిక బస్టాండ్ ఆవరణంలో సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాతిగుంటపల్లి నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.










