Dec 25,2022 15:29

ప్రజాశక్తి-కలకడ: క్రిస్మస్ వేడుకలను మండలంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మండలంలోని కలకడ, గంగిరెడ్డి గారి పల్లి, ఎర్రయ్యగారి పల్లి, దేవులపల్లి, ఎర్రయ్యగారి పల్లి కాలనీ, ఎర్రకోటపల్లి  తదితర ప్రాంతాల్లో ఏసుక్రీస్తు నామాన్ని స్మరిస్తూ క్రైస్తవులకు పవిత్రమైన చర్చలలో బైబిల్ నందు అంశాలతో ప్రార్థనలు చేసి దేవుని కృపకు పాత్రులయ్యారు. గంగిరెడ్డి గారి పల్లెలో పాస్టర్ శేఖర్ బైబుల్లోని అంశాలను ఉపన్యాసం చేయడంతో శ్రద్ధగా భక్తితో విని దేవుని కృపకు పాత్రులయ్యారు. అనంతరం క్రిస్టమస్ సందర్భంగా ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలుపుకొని, మిఠాయిలు పంచుకున్నారు.