Jan 02,2023 15:02

ప్రజాశక్తి - పుల్లంపేట : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్.యు.పి.పి.) 2023 సంవత్సరం కాలమానిని మండలంలోని పీవీజి పల్లె ఉన్నత పాఠశాలలో సోమవారం ఆవిష్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే.కృష్ణవేణి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర కార్యదర్శి గంగనపల్లి వెంకటరమణలు వీటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధవటం రెడ్డి ప్రసాద్, ముప్పల శివశంకర్ రాజు, సుజిత, భారతి, గౌరీదేవి, లక్కాకుల శ్రీనివాసులు, నూకల చంద్రకుమార్  తదితరులు పాల్గొన్నారు.