Sep 23,2023 20:23

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
చేతివృత్తుల వారిని ప్రోత్సహిద్దాం
ప్రజాశక్తి-నెల్లూరు:ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అమలుపై ప్రత్యేక దష్టి పెట్టి చేతివత్తుల వారికి ప్రోత్సాహం అందించాలని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు .స్థానిక కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన శనివారం జరిగింది.ఈ సమావేశంలో కలెక్టర్‌ ఎం .హరి నారాయణన్‌ మాట్లాడుతూ వత్తి పనిలో నైపుణ్యాన్ని పెంచి వారి వుత్పతులను ప్రోతహించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేదోడు పథకం కింద వత్తి , చిన్న వ్యాపారాలు చేసుకునే పేదలకు రుణాలు అందిస్తున్న దన్నారు .
పి ఎం.విశ్వకర్మ పథకం అమలులో లబ్ధిదారుల ఎంపికకు డి ఆర్‌ డి ఏ , బీసీ ,ఎస్సీ, ఎస్టీ ,మైనారిటీ వెల్ఫేర్‌ ,కార్మిక తదితర శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ ఈ పథకం పటిష్టంగా అమలు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనిపై సమీక్ష చేస్తున్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ పథకంలో వడ్రంగి కమ్మరి కుమ్మరి చర్మ కార్లు , దర్జీలు, చేపలు పట్టేవారు, బుట్టలల్లేవారు తదితర చేతివత్తుల వారికి ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందన్నారు. డాక్యుమెంట్ల పేరుతో పేద లబ్ధిదారులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండ, రుణాలు అందించాలని కలెక్టర్‌ లీడ్‌ బ్యాంక్‌ అధికారికి సూచించారు. లబ్ధిదారులకు గ్రామీణ పరిశ్రమల బోర్డ్‌ పై నమ్మకం పెరిగే విదంగా ఆ శాఖ అధికారులు పని చేయాలన్నారు.బ్యాంకర్లు, ఇండిస్టీస్‌ డిపార్ట్మెంట్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి రుణాలు పొందేందుకు వత్తి పని వారు రుణాలు పొందడానికి అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకంలో శిక్షణ పొందిన వారికి టూల్‌ కిట్స్‌ గాను 15000, మొదటి విడతగా లక్ష రూపాయల రుణం, సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రెండు లక్షల రూపాయలు రుణాలుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. పరిశ్రమ శాఖ ద్వారా ఏర్పాటు కానున్న బంగారు ఆభరణాల, రెడీమేడ్‌ దుస్తుల, చీరల డిజైనింగ్‌, నోటు పుస్తకాల తయారీ క్లస్టర్ల ఏర్పాటు కు స్థలాల కోసం ప్రతిపాదనలు పంపితే భూమి కేటాయింపు కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు .పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీ సుధాకర్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారని, పథకానికి చేతివత్తుల వారు, సాంప్రదాయ వత్తుల వారు అర్హులని, 18 సంవత్సరాలు నిండి ఉండాలని, కుటుంబానికి ఒకరు మాత్రమే అర్హులని, కమిటీ సభ్యులకు వివరించారు.ఈ సమావేశంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ ఈఈ, సిహెచ్‌ రాజశేఖర్‌, ఫ్యాక్టరీస్‌ చీఫ్‌ ఇన్స్పెక్టర్‌ కుమార్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విజయన్‌,జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌, శ్రీనివాసరావు, కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి బి చందర్‌, పలు శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.