ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మండల పరిధిలోని పెద్ద కారంపల్లి పంచాయతీలో ప్రభుత్వం నూతనంగా కేటాయించిన ముస్లిం స్మశాన వాటికలో శుక్రవారం మంచి నీటి బోరును ఏర్పాటు చేశారు. రూ 3 లక్షలు జిల్లా పరిషత్ నిధులతో జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సహకారంతో ఈ బోరును ఏర్పాటు చేయడం జరిగిందని ఖబరస్థాన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు జాహిద్ అలీ తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలతో బోరు ఏర్పాటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మసూద్ అలీ ఖాన్, కౌన్సిలర్లు న్యామతుల్లా, మున్నా, ముస్లిం పెద్దలు నజీర్, షఫీవుల్లా, అబూబకర్, టైగర్ హుస్సేన్, సర్పంచ్ మౌలాలి, మున్నాఫ్ తదితరులు పాల్గొన్నారు.










