Jun 14,2023 15:03
  • లయన్స్ క్లబ్ ఆఫ్ హార్సీలీహిల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రజాశక్తి - బి.కొత్తకోట : మదనపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్, హార్సీలీహిల్స్ వారి ఆధ్వర్యంలో బి.కొత్తకోట పట్టణంలోని ఆదిత్య డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని లయన్స్ క్లబ్ ఆఫ్ హార్సీలీహిల్స్ వారు తెలిపారు. మరియు ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు వరకు 55 మంది రక్తదానం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతలు దినోత్సవం సందర్భంగా నిర్మించిన రక్తదాత సుఖీభవ రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.