Dec 28,2022 15:40

ప్రజాశక్తి-నందలూరు: విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్ల తిమ్మయ్య గారి పల్లి సర్పంచ్ గీతాల శిరీష నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని నల్ల తిమ్మయ్య గారి పల్లి గ్రామపంచాయతీ కొత్త తిమ్మ రాచపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఫైరీత్రం, కిరోసిన్ ద్రావణం స్ప్రే చేయించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీతాల శిరీష మాట్లాడుతూ  ప్రస్తుతం ఉన్న విష జ్వరాలు పట్ల అప్రమత్తంగా ఉంటూ కాచి చల్లారిన నీటిని త్రాగాలని ప్రజలకు తెలియజేశారు. అనంతరం ప్రజలకు పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి భ్రమరాంబదేవి, వైద్య సిబ్బంది, వాలంటీర్ లు పాల్గొన్నారు.