ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని నెమ్మలదిన్నే, కొటాల పల్లి, పెద్ద పసుపుల గ్రామాల మీదుగా సాగిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి బత్యాల చంగల్ రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ బాబుతో బత్యాల మాట్లాడుతూ తప్పకుండా రాజంపేట మీదుగా యువగళం పాదయాత్రను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు టీడీపి రాష్ట్ర నాయకులు సోమలరాజు చంద్రశేఖర్ రాజు, తెలుగుయువత అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అనుమలగుండం విజయకుమార్, పట్టణ అధ్యక్షుడు రాము యాదవ్, సింగనమల నాగార్జున, తోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










