Jan 22,2023 16:42

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: ఇటీవల ఎస్వీ యూనివర్సిటీ లో జరిగిన బాల్ బాడ్మింటన్ పోటిల్లో పాల్గొన్న మదనపల్లె జ్ఞానంబికా విద్యార్థులు విజేతలుగా నిలిచారని కరెస్పాండంట్ రాటకొండ గురుప్రసాద్ తెలిపారు. అందులో ముగ్గురు విద్యార్థులు అల్ ఇండియా యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ కు ఎంపిక అయ్యారని ఎంపికైన వారిలో ఎమ్. చంద్రకళ, పి.ప్రతిభ, కె. హరిని వున్నారన్నారు. వీరు ముగ్గురు అల్ ఇండియా యూనివర్సిటీలో జరిగే క్యాంప్ లో పాల్గొని ఈ నెల 27వ తేదీన బి.ఎన్. అబ్దుర్ రెహమాన్ క్రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నైలో జరగబోయే ఆల్ ఇండియా టోర్న్మెంట్లో పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంట్ కు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెట్ గురుప్రసాద్, ప్రిన్సిపాల్ రమాదేవి, పిడి శరత్ లు అభినందించారు.