Sep 05,2023 22:23

బదిలీపై వెళుతున్న ఎం.వెంకటేశ్వర్లు, జె.ఉదయభాస్కర్‌


ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కష్ణా), విజయవాడ : కృష్ణాజిల్లా నూతన రెవెన్యూ అధికారిగా పి.వెంకట రమణ నియమితులయ్యారు. అనకాపల్లి జిల్లా డిఆర్‌ఒగా ఉన్న ఆయనను కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాజిల్లా డిఆర్‌ఒగా ఉన్న ఎం.వెంకటేశ్వర్లును ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయి. అలాగే ఎన్‌టిఆర్‌ జిల్లా ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌సిఒ) జె ఉదరుభాస్కర్‌ పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. 2021 నుంచి ఎఫ్‌సిఒగా ఉన్న ఆయన గతంలో సిసిఎల్‌ఎకు సంబంధించి ఎన్‌టిఆర్‌ జిల్లాలో సర్వే సెటిల్‌మెంట్‌ పనులను పర్యవేక్షించారు. పశ్చిమగోదావరి డిఆర్‌డిఎ పీడీగాను, అంతకు ముందు కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్‌డిఒగానూ పనిచేశారు.