Nov 11,2023 20:59

బాణాసంచా దుకాణంలో తనిఖీ చేస్తున్న అధికారులు

          అనంతపురం : దీపావళి పండుగ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బాణాసంచా ప్యాకేజీ వస్తువులపై తయారీదారుని పూర్తి చిరునామా, తయారైన నెల, సంవత్సరం, వినియోగదారుడు ఫిర్యాదు చేసేందుకు ఉండాల్సిన పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌, ఈ మెయిల్‌ ఐడి తదితర వివరాలు లేకపోవడంతో 11 కేసులు నమోదు చేసి ఐదు కేసులకు రూ.15వేలు జరిమానా విధించారు. ఈ దాడుల్లో లీగల్‌ మెట్రాలజీ ఇన్స్‌పెక్టర్‌ మహమ్మద్‌గౌస్‌, సిబ్బంది పి.విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.