ప్రజాశక్తి-కలకడ: ఆపదలో ఉన్న ప్రతి మహిళ దిశ యాప్ ను ఉపయోగించాలని ఎస్సై తిప్పేస్వామి తెలిపారు.మండలంలోని పాఠశాలలు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దిశ యాప్ గురించి అవగాహన కల్పించారు.ప్రతి మహిళ తమకున్న సెల్ఫోన్ నందు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా ప్రమాద సమయాల్లో ఎలాగా ఉపయోగించుకోవాలి అన్న అంశాలపై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా ప్రమాదంలో ఉన్న స్త్రీలు యాప్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు మీ దరికి చేరి ప్రమాదం నుండి విముక్తి పరిచేందుకు పోలీసులు చేరువలో ఉంటారని తెలియజేశారు.కాబట్టి ప్రతి మహిళ, ఆడపిల్లలు తప్పనిసరిగా దిశ యాప్ ను మీ మీ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.










