ప్రజాశక్తి-కలికిరి : కలికిరి గిరిజన కాలనీకి చెందిన జగన్నాథం లక్ష్మీదేవి తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్స్ ఆసుపత్రి నందు ఏఎన్ఎం నర్సుగా సేవలందిస్తుంది. ఈమె సేవలు గుర్తించి ఈవో ధర్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ సదా భార్గ, బర్డ్స్ డైరెక్టర్ రెడ్డప్ప, ఆర్ ఎం ఓ కిషోర్ నర్సింగ్ సూపర్డెంట్ జయలక్ష్మి ఆధ్వర్యంలో లక్ష్మీదేవి సేవలు గుర్తించి ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆమెకు రజిత పథకం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. లక్ష్మీదేవికి ఉత్తమ అవార్డు రావడంతో గిరిజన నాయకుడు శ్రీనివాస్ వర్మ, జగన్నాథం జనార్ధన, జగన్నాథం గౌరీ పలువురు హర్షం వ్యక్తం చేశారు.










