డాక్టర్లు సత్యశేఖర్, తిరుమల ప్రసాద్‌ను అభినందిస్తున్న జెడ్‌పి చైర్మన్ శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయనగరం : ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు ద్వారా రోగులకు అత్యున్నత వైద్య సేవలందించిన ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల వైద్యులను శుక్రవారం జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభినందిం చారు. ఉత్తమ ప్రాంతీయ కేంద్ర ఆసుపత్రిగా ఎంపికైన ఎస్.కోట ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌వి సత్య శేఖర్, ఉత్తమ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రిగా ఎంపికైన తిరుమల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమ్‌డి డాక్టర్ కె.తిరుమల ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్ప తుల్లో సౌకర్యాలు మరింత మెరుగుపరిచి ఫ్రెండ్లీ డాక్టర్లుగా సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో డిసిహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.










