Jul 23,2021 19:38

ఆస్కార్‌ అవార్డు గ్రహీత జోర్డాన్‌ పీలే తన మూడో చిత్రం పేరును ప్రకటించారు. ఆ సినిమా పేరు 'నోప్‌'. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఆయనే నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని తన ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. సినిమా పోస్టర్‌లో అరిష్టకరమైన ఓ మేఘం కమ్ముకొచ్చి విధ్వంసం సృష్టించనుందని తెలిసిపోతుంది. దీన్నిచూస్తే ఓ హర్రర్‌ మూవీ అని అర్థమౌతుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 22న థియేటర్లలో విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో బ్రిటీష్‌ యాక్టర్‌ డేనియల్‌ కలుయుయా, కెకె పామర్‌, స్టీవెన్‌ యూన్‌లతో కలిసి నటించనున్నారు. మంకీపా ప్రొడక్షన్స్‌కు చెందిన ఇయాన్‌ కూపర్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. యూనివర్సిల్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా.... వరుసగా ఇది మూడో సినిమా.