Apr 17,2023 19:44

మాట్లాడుతున్న గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు


మాట్లాడుతున్న గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు
అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం ఉపసంహరించుకోవాలి
-అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం డిమాండ్‌
నెల్లూరు:బోయ, వాల్మీకి, బెంతు, ఒరియా కులాలను ఎస్‌టి జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ నాయకులు హాజరై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27.39 లక్షల మంది గిరిజన జనాభా , 47.8శాతం అక్షరాస్యత కలిగి ఉన్నట్లు అప్పటి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందన్నారు. ఆధార్‌కార్డులు లేకపోవడంతో ఎంతో మంది గిరిజనలు ప్రభుత్వ పథకాలను అందుకోలేని దుస్థితిలో ఉన్నాయన్నారు
. అటువంటి తరుణంలో 40లక్షల మంది జనాభా గల బోయ, వాల్మీకులను గిరిజన జాబితాలో చేరిస్తే రిజర్వేషన్లు ప్రశ్నార్థకమౌతాయన్నారు. సమస్యను అర్ధం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినారి ప్రభాకర్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.