పరామర్శిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి అనుబంధ ఆర్యవైశ్య నాయకుడు, కందుకూరు నియోజకవర్గ టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షుడు మోదడుగు వెంకటేశ్వర్లు శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కందుకూరులోని సంకల్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఆస్పత్రికి వెళ్లి వెంకటేశ్వర్లును పరామర్శించారు. డాక్టర్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఆయన వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పలువురు నాయకులు ఉన్నారు.










