Apr 17,2023 21:50

ఆర్ధికసాయం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వలేటివారిపాలెం : మండలంలోని పోకూరు bస్టీకాలనీకి చెందిన తలపల ఏసురత్నం పూరిగుడిసె ఆదివారం అగ్నికి ఆహుతైంది. దీంతో కట్టుబట్టలతో మిగిలారు. విషయం తెలుసుకున్న పోకూరు గ్రామ సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టమనేని సుబ్బారావు, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో స్ధానిక టిడిపి నేతల ద్వారా రూ. పదివేలు చొప్పున ఆర్ధిక సహాయం సోమవారం అందజేశారు. నియోజకవర్గ టిడిపి క్రిస్టియన్‌సెల్‌ అధ్యక్షులు రెబ్బవరపు మాల్యాద్రి రూ.5వేలు, 25కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో గట్టమనేని లక్ష్మినరశింహర, వడ్లమూడి లక్ష్మినరశింహం, మన్నం వెంకట్రావు, అత్తోట వెంకటేశ్వర్లు, గురిజాల బెంజిమెన్‌, బద్దిపూడి శిఖామణి, అత్యాల అనిల్‌, గట్టమనేని శంకర్‌, గౌడపేరు శింగయ్య, జి కిషోర్‌, షేక్‌ హుస్సేన్‌, దార్ల సుబ్బారావు, లింగాబత్తిన మాల్యాద్రి పాల్గొన్నారు.