ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను, అరకాలగెడ్డ వీధి పాఠశాలలోనూ జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి ,డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు ఏ విధంగా చేస్తున్నారు, రోగులకు ఇచ్చే సూచనలు సలహాలపై వైద్య సిబ్బంది ఏవిధంగా వివరిస్తున్నారో పరిశీలించారు. శిబిరాలు వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాల స్టాల్స్ ను పరిశీలించారు. బాలామృతంతో చేసిన పదార్థాలను గమనించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను పలువురికి అందజేశారు. అనంతరం మేయరు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటివరకు నగరంలో 18 వేలకు పైబడి ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో వైద్యపరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పట్టా ఆదిలక్ష్మి, కనకల నాగవల్లి, వైసిపి నాయకులు తోనంగి జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.