ప్రజాశకి-విజయనగరం టౌన్ : అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలను అందిస్తూ, అవినీతి రహితంగా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఎపికి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని 1వ డివిజన్లోని సచివాలయం ప్రాంతంలో ప్రారంభించారు. ముందుగా డివిజన్ పరిధిలో లబ్ధిదారులకు ఇంతవరకు అందిన ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. ఆ తర్వాత బుక్లెట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని, మాటలను తప్పిన నైజం చంద్రబాబుదైతే, ఇచ్చిన మాటను నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు, అవినీతి రహితంగా అందుతున్నాయని తెలిపారు. ఒకటో డివిజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల 35 లక్షల 66 వేల 898 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ అయిందని అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్.శ్రీ రాములునాయుడు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, డిప్యూటీ మేయర్ యాదవ్ ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, జోనల్ ఇన్చార్జ్ ముచ్చు శ్రీనివాసరావు, మాజీ వైస్ చైర్ పర్సన్ లంక వరలక్ష్మి పాల్గొన్నారు.
నెల్లిమర్ల : మండలంలోని సీతారామునిపేట సచివాలయం వద్ద సంక్షేమ పథకాల డిజిటల్ బోర్డును గురువారం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పి.సురేష్‌బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైస్ ఎంపిపి పతివాడ సత్యనారాయణ, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, ఎంపిడిఒ జి.రామారావు, ఎంపిటిసి ఎం.శాంతికుమారి, నాయకులు రాంబారికి రామారావు, నడుపూరు పరిసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : ఎస్.కోట -1 సచివాలయం పరిధిలో సంక్షేమ పథకాల డిస్ ప్లే బోర్డును గురువారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు మోపాడ కుమార్, ఫోక్ అండ్ కల్చరల్ డైరెక్టర్ వాకాడ రాంబాబు, వైస్ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, జెసిఎస్ ఇన్‌ఛార్జి వాకాడ సతీష్, పోతనపల్లి వెంకటరావు, బుగత వెంకటేశ్వరరావు, సారిపల్లి గణేష్, దారగిరి, ఎంపిటిసి కడారి అప్పయ్య, ఆవాల కృష్ణ, తలారి అనంత్ పాల్గొన్నారు.
వేపాడ : వేపాడ గ్రామ సచివాలయంలో వద్ద సర్పంచ్ ఎం.అర్జునమ్మ ఆధ్వర్యాన డిజిటల్ బోర్డును ఎంపిపి డి.సత్యవంతులు ప్రారంభించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వి.వి.చినరామునాయుడు, ఎఎంసి చైర్‌పర్సన్ ఎం.కస్తూరి, కో-ఆపరేటివ్ అధ్యక్షులు రామ్మూర్తి నాయుడు, ఎంపిడిఒ పట్నాయక్, ఇఒపిఆర్‌డి ఉమ, ఎంఇఒ పి.బాలభాస్కరరావు, పిఆర్ జెఇ ఆలీ, ఎపిఒ ఆదిలక్ష్మి, ఎపిఎం శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గౌరి, నాయకులు జగ్గుబాబు, ఎం.సత్యనారాయణ, సర్పంచులు ఎం.గంగరాజు, ఎంపిటిసిలు గంగ తల్లి. సత్యనారాయణ, బొడ్డు శ్రీను, సర్పంచ్ కోలా సతీష్ పాల్గొన్నారు.
బొండపల్లి : విభజన వల్ల నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎంపిపి చల్ల చలంనాయుడు, జెడ్‌పిటిసి రాపాక సూర్యప్రకాశరావు తెలిపారు. గురువారం బొండపల్లి సచివాలయం-1 ఆవరణలో సర్పంచ్ బి.ఈశ్వరరావు అధ్యక్షతన ఈ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నంనాయుడు, ఎంపిడిఒ వైవి.రాజేంద్ర ప్రసాద్, తహశీల్దార్ డిఎం.జి.ఎన్.ప్రసాద్ రావు, వైస్ ఎంపిపి గొండెల ఈశ్వర రావు, ఇఒపిఆర్‌డి సుగుణాకర్ రావు, పిఎసిఎస్ అధ్యక్షులు మహంతి రమణ, జెవిఎస్ మండల కన్వీనర్ పల్లి రఘు, సర్పంచులు ఈదుబిల్లి కృష్ణ, ఎస్.ఆదినారాయణ, వైస్ సర్పంచ్ కోల వెంకటరమణ, ఎంపిటిసి సభ్యులు బండారు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
భోగాపురం : జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురంలోని సచివాలయం-1 పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సచివాలయంలో పథకాలను తెలిపే డిస్ ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, ఎంపిడిఒ అప్పలనాయుడు, తహశీల్దార్ బంగార్రాజు, ఇఒపిఆర్‌డి సురేష్, సర్పంచ్ అప్పయ్యమ్మ, నాయకులు పడాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కొమ్మూరి శుభోషణరావు, సుందర హరీష్ తదితరులు పాల్గొన్నారు.
జామి : వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమం జామి సచివాలయం-1లో ప్రారంభమైంది. తొలుత జామి బస్టాండ్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసిపి మండల కన్వీనర్ గొర్లి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపిపి ఎస్.అరుణ, జెడ్‌పిటిసి సరయు, వైస్ ఎంపిపి గేదెల వెంకటరావు, వైసిపి నాయకులు పి.సంజీవి, జామి సర్పంచ్ చిప్పాడ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
గజపతినగరం : గజపతినగరం సచివాలయం-1లో వై నీడ్స్ ఎపి జగన్ కార్యక్రమాన్ని జెడ్‌పిటిసి గార తవుడు ప్రారంభించారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డు, జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెల్లాన త్రినాథరావు, వైసిపి మండల అధ్యక్షులు బూడి వెంకటరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, సర్పంచ్ కొండమ్మ, ఎంపిటిసి కర్రి కళావతి, వైస్ సర్పంచ్ కర్రి రామునాయుడు, కర్రి నానాజీ, ఎంపిడిఒ కె.కిషోర్ కుమార్, తహశీల్దార్ ఎం.అరుణకుమారి పాల్గొన్నారు.
బొబ్బిలి : మున్సిపాలిటీ పరిధిలో రెండో సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ప్రారంభించారు. ముందుగా సంక్షేమ పథకాలు లబ్ధిని వివరించే బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్టారావు, వైస్ చైర్మన్లు గొలగాన రమాదేవి, చెలికాని మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు, కౌన్సిలర్ చోడగంజి రమేష్‌నాయుడు, పట్టణ జెసిఎస్ కన్వీనర్ ఈశ్వరరావు పాల్గొన్నారు.