ప్రజాశకి-విజయనగరం టౌన్ : అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలను అందిస్తూ, అవినీతి రహితంగా పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఎపికి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని 1వ డివిజన్లోని సచివాలయం ప్రాంతంలో ప్రారంభించారు. ముందుగా డివిజన్ పరిధిలో లబ్ధిదారులకు ఇంతవరకు అందిన ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. ఆ తర్వాత బుక్లెట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని అన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని, మాటలను తప్పిన నైజం చంద్రబాబుదైతే, ఇచ్చిన మాటను నిలబెట్టడమే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని అన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు, అవినీతి రహితంగా అందుతున్నాయని తెలిపారు. ఒకటో డివిజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 11 కోట్ల 35 లక్షల 66 వేల 898 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ అయిందని అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్.శ్రీ రాములునాయుడు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, డిప్యూటీ మేయర్ యాదవ్ ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్, వైసిపి నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, జోనల్ ఇన్చార్జ్ ముచ్చు శ్రీనివాసరావు, మాజీ వైస్ చైర్ పర్సన్ లంక వరలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
విద్యార్థుల పోరాట విజయం