May 22,2023 15:53
  •  పోతుగుట రమేష్ నాయుడు

 ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడంలోనే పరమానందం ఉంటుందని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలియజేశారు. తన తల్లి పోతుగుంట లక్ష్మమ్మ  నాలుగవ వర్ధంతి సందర్భంగా సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ కూడలిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వై.సుబ్రహ్మణ్యం రాజు, రీజన్ చైర్మన్ షేక్ అబ్దుల్లా, మాజీ రీజన్ చైర్మన్లు ఎం.రామకృష్ణ నాయుడు, పిడికిటి నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు ఏ.వెంకటసుబ్బయ్య నాయుడు, లయన్స్ క్లబ్ సభ్యులు పి.చంద్ర, జీ.కే నాగరాజు, తోట నగేష్ తదితరులు పాల్గొన్నారు.