Mar 16,2023 16:02

ప్రజాశక్త- నందలూరు(అన్నమయ్య): లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషిస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటున్న కానకుర్తి వెంకటయ్య,విజయ దంపతుల 36 వ వివాహ దినోత్సవం సందర్భంగా గురువారం  అరవపల్లి ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణములో లయన్స్ మరియు వాకర్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదానం మహా పుణ్యకార్యమని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ వారికి పలువురు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థలకు దాతలు ముందుకు వచ్చి వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ వెంకటయ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పలువురు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ మన్నెం రామ్మోహన్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కుర్రా మణి యాదవ్, కొత్తపల్లి రాజా చారి, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్యామనబోయిన గురు ప్రసాద్, వాకర్స్ క్లబ్ సెక్రటరీ మోడపోతుల రాము, సభ్యులు చామంచి పెంచలయ్య, జంగం శెట్టి హరిప్రసాద్, సునీల్ రెడ్డి, మేస్త్రి శంకర్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.