- అందజేసిన రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి
ప్రజాశక్తి-రాజంపేట రూరల్ : అంగన్వాడీ పోస్టులకు ఎంపికైన మహిళలకు శనివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అంగన్వాడి ఆయాలతో మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో చదువుకుంటున్న పిల్లలను తమ పిల్లలుగా భావించి వారిని చూసుకోవాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల జడ్పిటిసి శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ వైసీపీ నాయకులు గడికోట సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా వాక్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ వైయస్సార్సీపి రాష్ట్ర యువజన నాయకులు నడివీధి సుధాకర్, నందలూరు మండల కో ఆప్షన్ సభ్యులు మరియు నందలూరు మండల జేఏసీ కన్వీనర్ కరిముల్లా ఖాన్ రాజంపేట వార్డు కౌన్సిలర్ పసుపులేటి సుధాకర్ ఎంపీటీసీ బాబు సత్యాల రామకృష్ణ సిద్ధవటం మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి సిద్ధవటం మండల జేఏసీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.










