ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వయోజనులకు అవగాహన కల్పించాలన్నదే అక్షర చైతన్యం ఉద్ధేశ్యమని ఎంఇఒ -2 డి. నాయుడు పేర్కొన్నారు. మండలంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, వయోజన విద్య ఆంధ్రప్రదేశ్ సంయుక్త నిర్వహణలో ప్రాథమిక అక్షరాస్యత పరీక్షలు జరిగాయి. ఎంఇఒ జయరామ నాయుడు వరిగొండ పరీక్ష కేంద్రాన్ని పరి శీలించారు. జయరామ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలు తెలుసుకోవడం, సంబంధిత ధ్రువపత్రాలను చదివి కనీసం సంతకం చేయడం వంటి కార్యక్రమంలో భాగంగా ఈ అక్షర చైతన్యం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారుసౌత్ ఆములూరులోని ప్రాథమికొన్నత పాఠశాలలో 95 శాతం వయోజనులు పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కేంద్ర పర్యవేక్షకులు షేక్. అహ్మద్ భాషా తెలిపారు. అందుకోసం కషి చేసిన గ్రామ వలెంటీర్లను అహ్మద్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సునీజ, డిజిటల్ అసిస్టెంట్ బి. మస్తాన్ పరీక్ష నిర్వహించారు.










