Apr 18,2023 18:58

విద్యార్థులను అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :పామూరు రోడ్డులో ఉన్న ఆక్సఫర్డ్‌ ఒలంపియాడ్‌ స్కూల్‌ విద్యార్థులు సైన్‌స్స్‌ ఒలంపియాడ్‌ ఫౌన్‌డేషన్‌ మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో 81 మంది విద్యార్థులు గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల చైర్మన్‌ ఉన్నం భాస్కర్‌ రావు మాట్లాడుతూ గొప్ప విజయాలు సాధించాలంటే నిరంతర శ్రమ అవసరమని తెలిపారు. పాఠశాల డైరెక్టర్‌ బాల భాస్కర్‌ రావు, కాలేజీ డైరెక్టర్‌ బి.నరేంద్రబాబు, ప్రిన్సిపాల్స్‌ రామారావు, మల్లికార్జున, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.