Apr 18,2023 19:03

ఆహారం పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుద్ధాం వారి కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో కందుకూరు వారి శ్రీరామ సాయి బాబా వెల్ఫేర్‌ సొసైటీ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేసు ధనలక్ష్మి 2వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దేసు శ్రీనివాసులు సహకారంతో పట్టణంలోని స్వయంకషి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు, చీదెళ్ళ క్రష్ణ పాల్గొన్నారు.