Feb 06,2023 15:26

ప్రజాశక్తి-రాయచోటి(అన్నమయ్య ) : సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రమైన రాయచోటిలో కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా గ్రాట్యూటీ ఇస్తూ అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అంగన్వాడీ కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం  మేనిఫెస్టో లో చెప్పిన విధంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుక వచ్చిన ఫేస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని, హెల్పర్స్ పదోన్నతి విషయంలో రాజకీయ ప్రమేయన్ని అరికట్టి, ప్రమోషన్ G.Oను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిని అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లగా గురించి వర్కర్స్ తో సమానంగా వేతనాలు ఇవ్వాలిని, 2017 నుండి పెండింగ్లో వున్నా T. A బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ కార్యకర్తలపై చిత్తశుద్ధి లేదని స్పష్టంగా  అర్థమవుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఫుడ్ కమిషనర్ అంగన్వాడీ కార్యకర్తలను అసభ్య కరంగా మాట్లాడటం సరికాదన్నారు. ఒక్కసారి అంగన్వాడీల సమస్యలు గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించక పోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.