వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం
వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం
అదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
ముత్తుకూరు:అదాని ఫౌండేషన్ మరియు అపోలో ఫౌండేషన్ సంయుక్తంగా ముత్తుకూరు మండలం నార్కెలపల్లి గ్రామంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ గాయత్రి డాక్టర్ సుహర్షన్, ఆధ్వర్యంలో 60 మందికి ఈ వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు .ఈ వైద్య శిబిరం లో మహిళలకు క్యాన్సర్ కారక పరీక్షలు చేసి నమూనాలను సేకరించడమైనది.అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం పలు సూచనలు సలహాలను గ్రామస్తులకు అందించారు. నార్కెలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్ కష్ణవేణి ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఆదాని ఫౌండేషన్ ప్రతినిధులు రవీంద్ర అరుణ్ తదితరులు పాల్గొన్నారు.










